పాకిస్థాన్ క్రికెట్ టీంకు ఎట్టకేలకు భారత వీసాలు అంది.. హైదరాబాద్ చేరుకుంది. మూడున్నర దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టింది. బుధవారం రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పాక్ టీమ్, అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ జట్టు తలపడనుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతునున్నాయి.