Neeraj Chopra Performs Garba: నవరాత్రి ఉత్సవాల్లో గర్బ ఆడుతూ ఎంజాయ్ చేశాడు ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా. గుజరాత్‌లోని వడోదరలో జరుగుతున్న నవరాత్ర ఉత్సవాల్లో నీరజ్ పాల్గొన్నాడు. దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్థానికులతో కలిసి గర్బ ఆడాడు. అతనితో సెల్ఫీలు దిగడానికి అక్కడి వాళ్లు ఎగబడ్డారు. దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు గుజరాత్‌లో ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్.. సరదాగా గడిపాడు. అతడు గర్బ ఆడిన వీడియో ఇక్కడ చూడండి.