Team India: టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ.. హార్దిక్ పాండ్యా దూరం
- వన్డే ప్రపంచ కప్ లో వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. సెమీఫైనల్‌కు చేరువలో ఉంది. ఈ ప్రపంచ కప్ లో తదుపరి మ్యాచ్, ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ నెల 29న లక్నోలో మ్యాచ్ ఉంటుంది. ఇప్పటికే భారతసేనలు లక్నో చేరుకున్నారు. అయితే ఇంగ్లండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. కీలక ఆటగాడు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిసింది. హార్దిక్ కాస్త కోలుకున్నప్పటికీ టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు తెలిసింది.