India and Nepal match | వర్షం భయం మధ్యనే భారత్, నేపాల్ మ్యాచ్ కు సిద్ధమైన అభిమానులు
- శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్-2023 ఐదవ మ్యాచ్ ఇవాళ భారత్-నేపాల్ మధ్య ఉంది. వర్షం భయంతోనే అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇరు దేశాల అభిమానులు ఇప్పటికే పల్లెకెలె క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా నేపాల్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు కూడా వానగండం ఉందని ఇక్క డి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు నేపాల్ మ్యాచ్‌లోనూ 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా జరగడం కష్టమనిపిస్తోంది. ఇక పాయింట్ల విషయానికి వస్తే 2 మ్యాచ్‌లు ఆడిన పాక్ 3 పాయింట్లతో గ్రూప్-ఏ నుంచి సూపర్-4కు అర్హత సాధించింది.