ఇంగ్లండ్ టీమ్ భారత్ కు చేరుకుంది. వన్డే ప్రపంచ కప్ కోసం ఇండియాకు వచ్చింది ఇంగ్లీష్ టీమ్. రేపు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇది రెండు జట్లకు వార్మప్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత భారత్ అక్టోబర్ 3న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఆడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక జట్టులోకి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాకపై నెలకొన్న సందిగ్ధత తెరపడినట్లు తెలుస్తోంది.