ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే భారీగా అభిమానులు స్టేడియం వద్దకి చేరుకున్నారు. ఆయా జట్లకు సంబంధించిన చిత్రాలను ముఖాలపై వేసుకొని సందడి చేస్తున్నారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇవాళ జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు టీమిండియాతో ఫైనల్ ఆడుతుంది. అయితే ఆస్ట్రేలియాతో పోల్చితే సౌత్ ఆఫ్రికా కాస్త వీక్ అనిపిస్తోంది. ఇవాళ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా ఎలా కొట్టబోతుందో చూడాలి.