క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 భారత్ వేదికగా ప్రారంభం అయింది. వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 6, 9, 10 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ క్రమంలోనే పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యా చ్‌ల కోసం 1,500 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ..అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్లు, పదునైన లోహాలు లేదా ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్‌లు, కాయిన్స్, రైటింగ్ పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పెర్ఫ్యూమ్‌లు, సంచులు, బయట తినుబండారాలను స్టేడియం లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.