వీడియో : "ప్లీజ్... అలాంటి అభియోగాలు నాపై మోపకండి" - బర్త్ డే పార్టీ వివాదంపై 'మంగ్లీ' రియాక్షన్-singer mangli reaction about her birthday party issue ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : "ప్లీజ్... అలాంటి అభియోగాలు నాపై మోపకండి" - బర్త్ డే పార్టీ వివాదంపై 'మంగ్లీ' రియాక్షన్

వీడియో : "ప్లీజ్... అలాంటి అభియోగాలు నాపై మోపకండి" - బర్త్ డే పార్టీ వివాదంపై 'మంగ్లీ' రియాక్షన్

Published Jun 12, 2025 01:03 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 12, 2025 01:03 PM IST

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల శివారులోని ఓ రిస్టార్ట్ లో జరిగిన పుట్టినరోజు వేడుకలపై పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో లిక్కర్, గంజాయి లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మంగ్లీతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ పార్టీ వ్యవహారంపై మంగ్లీ స్పందిస్తూ... ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. లిక్కర్‌కు, సౌండ్‌ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై తనకు అస్సలు అవగాహన లేదన్నారు. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని అని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విదేశీ మద్యం లేదన్నారు. లోకల్ లిక్కర్ మాత్రమే ఉందని వెల్లడించారు. పోలీసులు సెర్చ్‌ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదన్నారు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్‌ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో , ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారని మంగ్లీ వెల్లడించారు. పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని చెప్పారు. " మీడియా మిత్రులకు నా విన్నపం. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు….. ప్లీజ్‌’’ అంటూ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. మంగ్లీ విడుదల చేసిన వీడియోను ఇక్కడ వీక్షించండి…..

More