కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. రెండో రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగాన్ని విడుదల చేశారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విధంగా... వీడియోను రూపొందించారు. ఇందులో సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు తన మనవడు లోకేష్‌ని చూస్తుంటే ముచ్చటేస్తోంది... భళా మనవడా.. భళా అంటూ.. ప్రసంగం ఉండేలా రూపొందించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.