Ram Charan Warning Video : డాడీ గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఎవరికీ తెలియదు
- వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వారికి రామ్‌చరణ్ వార్నింగ్ ఇచ్చాడు. నాన్న సౌమ్యంగా ఉంటారేమో కానీ ఆయన వెనక ఉండే తాము మాత్రం సైలెంట్‌గా ఉండబోమని రామ్‌చరణ్ స్పష్టం చేశాడు. అతడి కామెంట్స్ టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. వీరయ్య విజయ విహారం పేరుతో వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్‌ను వరంగల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్ హాజరయ్యాడు.