హర్యానాలో ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి 14 ఏళ్లుగా చెప్పులు లేకుండా నడిచిన కైతల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ వచ్చారు. ఆయనకు జీవితంలోనే అతిపెద్ద సంతోషం దక్కింది. మోడీ ఆయనను కలవడమే కాకుండా స్వయంగా తన చేతులతో చెప్పులు తొడిగారు. ఇక్కడ చరిత్రాత్మక, భావోద్వేగ క్షణాన్ని సృష్టించారు.