Landslide | కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల గురించి మామూలుగా వార్తల్లో చదువుతుంటాం. కొండచరియలు విరిగిపడడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఒక భారీ వర్షం అనంతరం చంబా జిల్లాలోని కొటి వంతెన పక్కనున్న పర్వతంపై నుంచి కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. ప్రత్యక్ష సాక్షులు రికార్డు చేసి, అప్‌లోడ్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. కొండ పై నుంచి ఒక భారీ ముక్క విరిగి పక్కనున్న నదిలో, కోటి బ్రిడ్జిపై పడడం చూడవచ్చు. గత నెల రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం తదితర కారణాలతో 140 మంది ప్రాణాలు కోల్పోయారు.