Uttarkashi Tunnel | సొరంగంలో కార్మికులు క్షేమం.. మల్టీ విటమిన్‌ మాత్రలు, ఎండు ఫలాలు సరఫరా-video of the workers trapped in the tunnel in uttarkashi has been released ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uttarkashi Tunnel | సొరంగంలో కార్మికులు క్షేమం.. మల్టీ విటమిన్‌ మాత్రలు, ఎండు ఫలాలు సరఫరా

Uttarkashi Tunnel | సొరంగంలో కార్మికులు క్షేమం.. మల్టీ విటమిన్‌ మాత్రలు, ఎండు ఫలాలు సరఫరా

Nov 21, 2023 11:09 AM IST Muvva Krishnama Naidu
Nov 21, 2023 11:09 AM IST

  • ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో కార్మికుల పని చేస్తున్న క్రమంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుంగిపోయింది. ఈ నెల 12న ఈ ఘటన జరిగింది. దీంతో 41 మంది కార్మికులు అక్కడే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తెచ్చేందుకు దేశ, విదేశాల నుంచి నిపుణులను కేంద్ర ప్రభుత్వం రప్పించింది. అయినప్పటికీ బయటకు తీసేందుకు చేస్తున్న చర్యలు అనుకున్నంత వేగంగా ఫలించటం లేదు. ఇటు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సొరంగంలోని కార్మికుల వద్దకు అధునాతన కెమెరాలు పంపించారు. వాటి ద్వారా కార్మికుల పరిస్థితిని తెలిపే దృశ్యాలను చిత్రీకరించారు. వాటిని తాజాగా విడుదల చేశారు. అందులో కార్మికులు తిరిగాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరో రెండు,మూడు రోజుల్లో కార్మికులు బయటకు వస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

More