న్యాయ వ్యవస్థపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించ వద్దని వీపీ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలని అనుకోవడం సమంజసం కాదని తేల్చి చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.