దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టినట్టుగానే, వందే సాధారణ్ రైళ్లను తెస్తోంది కేంద్రం. ఈ రైళ్లు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా తయారు చేసింది. ఈ వందే సాధారణ్ రైలులో నాన్-ఏసీ స్లీపర్, నాన్-ఏసీ జనరల్ వర్షన్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. చెన్నై ICFలో వందే సాధారణ్ రైళ్లను తయారు చేస్తున్నారు. స్లీపర్ వెర్షన్ దేశవ్యాప్తంగా 30 రూట్స్‌లో నడవనున్నాయి. భరతీయ రైల్వే మూడు విభిన్న సాంకేతికతలతో వందే భారత్ రైళ్లలో 400 స్లీపర్ వెర్షన్‌ను తయారు చేయాలని కూడా యోచిస్తోంది. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.