Uttarakhand rains: భారీ వర్షాలు, ఉధృతమైన వరదలు ఉత్తరాఖండ్‌లో ఒకే కుటుంబంలోని 9 మంది ప్రాణాలు తీశాయి. వారు ప్రయాణిస్తున్న కారు గురువారం ఉదయం వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్న ధేలా నదిలో పడిపోయింది. వరద ఉధృతికి నదిలో కొంతదూరం కొట్టుకుపోయింది. కారు నదిలో తలక్రిందులుగా పడడంతో, కారులోంచి బయటపడడం అందులోని వారికి సాధ్యం కాలేదు. కారులో నుంచి మృతదేహాలను వెలికితీయడం అధికారులకు చాలా కష్టమైంది. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబంలోని 22 ఏళ్ల యువతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆ కుటుంబం ఉత్తరాఖండ్ నుంచి పంజాబ్ వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.