రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్. అంబేడ్కర్ జయంతి ఘనంగా జరుగుతోంది. ఢిల్లీ సహా అన్నీ రాష్ట్రాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. పార్లమెంటు ఆవరణలోని ప్రేరణ స్థలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నివాళి అర్పించారు.