భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి. షెల్లింగ్, డ్రోన్ బాంబుల పేలుడు శబ్దాలు, ఎమర్జెన్సీ చర్యలు లేకపోవడంతో లైన్ ఆఫ్ కంట్రోల్ గ్రామాల్లోని ప్రజలు క్రమంగా బయటకు వస్తున్నారు. మరికొందరు ఉద్రిక్తతలతో సొంత గ్రామాలను, ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకుంటున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌కోట్‌లో ఇప్పుడు జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వస్తోంది.