Taliban massacre: 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చిన తాలిబన్
Taliban massacre: అహ్మద్ మస్సూద్ నేతృత్వంలోని పంజ్‌షీర్ రెసిస్టెన్స్ గ్రూపుకు చెందిన కనీసం 40 మంది తిరుగుబాటుదారులను తాలిబాన్ హతమార్చింది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తిరుగుబాటుదారులు హతమయ్యారని తాలిబాన్ తెలిపింది. సుందరమైన పంజ్‌షీర్ లోయ 1980లలో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రతిఘటనకు, ఇస్లామిస్టులు అధికారంలో ఉన్న సమయంలో తాలిబాన్ వ్యతిరేక తిరుగుబాటు స్థావరానికి ప్రసిద్ధి చెందింది. అయితే మరణించిన తిరుగుబాటుదారుల సంఖ్యను తాలిబాన్ ఎక్కువ చేసి చూపుతోందని ఎన్ఆర్ఎఫ్ పేర్కొంది. ఈ హత్యలను తాలిబాన్ ప్రకటించిన తర్వాత.. ఉరిశిక్షల వీడియో వైరల్ అయింది. పంజ్‌షీర్‌లో తాజా పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ నివేదికను చూడండి.