దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గుజరాత్‌లోని కెవాడియాలో 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో మహిళా CRPF సిబ్బంది సాహసోపేతమైన ఫీట్‌ను మోదీ చూసి ప్రశంసించారు. ఈ కవాతు సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా పరీక్షించడం పట్ల యువకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.