Viral Video: పశువు దాడితో ఎగిరిపడ్డ వృద్ధుడు.. వీడియో వైరల్-stray cattle attacked 85 year old man at chennai ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: పశువు దాడితో ఎగిరిపడ్డ వృద్ధుడు.. వీడియో వైరల్

Viral Video: పశువు దాడితో ఎగిరిపడ్డ వృద్ధుడు.. వీడియో వైరల్

Published Oct 19, 2023 09:17 AM IST Muvva Krishnama Naidu
Published Oct 19, 2023 09:17 AM IST

  • విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులుపై ఇప్పటికే పలు దాడి ఘటనలు జరిగాయి. తాజాగా రోడ్డుపై తిరుగుతున్న ఓ పశువు.. దాడి చేయడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది. తిరువల్లికేణిలోని పార్థసారథి ఆలయ ప్రాంతంలో బుధవారం రోడ్డుపై ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడే నిలబడి ఉన్న పశువు, ఆ వృద్ధుడిని కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో వృద్ధుడు కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పొడిచిన పశువు యజమానిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. గ్రేటర్ చెన్నై కార్పొ రేషన్లో ఈ ఏడాదిలో ఇప్ప టివరకు 3,737 పశువులను పట్టుకున్నామని తెలిపారు.

More