Terrorists kill Kashmiri Pandit : క‌శ్మీర్లో మ‌రో పండిట్ హ‌త్య‌-shopian terrorists kill kashmiri pandit injure another after i day grenade attacks on cops ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Terrorists Kill Kashmiri Pandit : క‌శ్మీర్లో మ‌రో పండిట్ హ‌త్య‌

Terrorists kill Kashmiri Pandit : క‌శ్మీర్లో మ‌రో పండిట్ హ‌త్య‌

Aug 16, 2022 07:04 PM IST HT Telugu Desk
Aug 16, 2022 07:04 PM IST

 క‌శ్మీర్లో ఉగ్ర‌వాదులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. క‌శ్మీర్లోని షోపియాన్ జిల్లాలో క‌శ్మీరీ పండిట్ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. క‌శ్మీరీ పండిట్ సోద‌రులైన సునీల్ కుమార్‌, పింటూల‌పై అక్క‌డి ఒక యాపిల్ తోట‌లో ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. దాంతో, సునీల్ కుమార్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. పింటూ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల కోసం గాలింపు ప్రారంభించారు. గ‌తంలో ఓ క‌శ్మీరీ పండిట్‌ను ఆయ‌న ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనే ఉగ్ర‌వాదులు కాల్చిచంపారు. ఆ ఘ‌ట‌న‌ప పండిట్లు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలిపారు. ఇటీవ‌ల క‌శ్మీర్లో పండిట్లు, స్థానికేత‌రులు, భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజా ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఈ వీడియోలో..

More