Shinzo Abe | షింజో అబే పై కాల్పుల దృశ్యాలు.. -shinzo abe s shooter is japan navy veteran attacker fired two bullets with a handmade gun ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Shinzo Abe | షింజో అబే పై కాల్పుల దృశ్యాలు..

Shinzo Abe | షింజో అబే పై కాల్పుల దృశ్యాలు..

Published Jul 08, 2022 04:27 PM IST HT Telugu Desk
Published Jul 08, 2022 04:27 PM IST

Shinzo Abe | జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేను హ‌త్య చేసిన తెత్సుయ యామ‌గామి(41) జపాన్ నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. `జ‌పాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌`లో యామ‌గామి 2005 వ‌ర‌కు ప‌నిచేసి, రిటైర్ అయ్యాడ‌ని తెలిసింది. అయితే, ఈ నేవీ మాజీ ఉద్యోగి మాజీ ప్ర‌ధానిని ఎందుకు చంపార‌నే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. షింజో రాజ‌కీయ అభిప్రాయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన త‌రువాత యామ‌గామి స్ప‌ష్టం చేశారు. కాల్పుల‌కు ఉప‌యోగించిన షాట్‌గ‌న్‌ను తానే త‌యారు చేసుకున్న‌ట్లు స‌మాచారం. నారా ప‌ట్ట‌ణంలో రైల్వే స్టేష‌న్ వెలుప‌ల ఎన్నికల ప్ర‌చారంలో షింజో అబే పాల్గొంటార‌ని గురువారం రాత్రే నిర్ధారించారు. ఈ విష‌యాన్ని హంత‌కుడు యామ‌గామికి ఎవరు లీక్ చేశార‌నే విష‌యంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. షింజే ప్ర‌సంగించనున్న ప్ర‌దేశానికి యామ‌గామి ముందే వ‌చ్చి, షింజే కోసం ఎదురు చూశాడు. గ్రే క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌లో, స్పెక్ట్స్ ధ‌రించి భుజానికి బ్యాగ్‌తో అత‌డు అక్క‌డ ఉన్న వీడియో వైర‌ల్ అవుతోంది.

More