Building collapses in seconds in Shimla:`పేకమేడలా కుప్పకూలింది..`
Building collapses in seconds in Shimla: భారీ వర్షాలు, వరదల ప్రభావం హిమాచల్ ప్రదేశ్‌పై తీవ్రంగా ఉంది. వరదలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తోంది. రాజధాని సిమ్లాలోని ఒక మూడంతస్తుల భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. సిమ్లాలోని చోపల్ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదకర స్థితిలో ఉండడంతో భవనాన్ని ఇప్పటికే అంతా ఖాళీ చేశారు. ఆ మూడంతస్తుల భవనం క్షణాల్లో పేకమేడలా కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.