బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ముందంజలో ఉన్న ఎన్నారై రుషి సునక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదీ ఒక చిన్న విషయంలో ట్రోల్‌కు గురవుతున్నారు రుషి సునక్. ఆయన ప్రధాని పదవి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆయన వెనుక ఒక క్యూఆర్ కోడ్, దానిపై రెడీఫర్‌రుషి. కామ్` అనే హెడింగ్, క్యూఆర్ కోడ్ కింద `స్కాన్ మి టు జాయిన ద క్యాంపెయిన్` అనే పదం ఉంది. అయితే, క్యాంపెయిన్ స్పెలింగ్ తప్పుగా ఉంది. 'campaign కు బదులుగా `CAMPIAIGN` అని ఉంది. దీన్ని గమనించిన ప్రేక్షకులు రిషిపై ట్రోలింగ్ ప్రారంభించారు. దీనికి స్పందిస్తూ రుషి సునక్ `రెడీ ఫర్ స్పెల్‌చెక్` అంటూ ట్వీట్ చేశారు.