UK next PM | ప్రీతి, రిషి, సెల్లా.. కౌన్ బ‌నేగా యూకే నెక్ట్స్ పీఎం?-rishi sunak suella braverman the indian origin favourites amid race for uk pm post ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uk Next Pm | ప్రీతి, రిషి, సెల్లా.. కౌన్ బ‌నేగా యూకే నెక్ట్స్ పీఎం?

UK next PM | ప్రీతి, రిషి, సెల్లా.. కౌన్ బ‌నేగా యూకే నెక్ట్స్ పీఎం?

Published Jul 08, 2022 06:37 PM IST HT Telugu Desk
Published Jul 08, 2022 06:37 PM IST

UK next PM | ఈ న‌లుగురిలో బ్రిట‌న్ పీఎం ఎవ‌రు? బోరిస్ జాన్స‌న్ రాజీనామా త‌రువాత బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌దవి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది. అయితే, ఈ రేసులో భార‌త ఉప‌ఖండానికి చెందిన న‌లుగురు ప్ర‌ధానంగా పోటీ ప‌డుతుండ‌డం విశేషం. వారిలో ముగ్గురికి భార‌తీయ మూలాలుండ‌గా, ఒక‌రు పాకిస్తాన్ సంత‌తికి చెందిన వారు. బోరిస్ జాన్స‌న్ మంత్రివ‌ర్గంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన రిషి సున‌క్‌, ప్రీతి ప‌టేల్‌, సెల్లా బ్రేవ‌ర్మ‌న్‌లకు భార‌తీయ మూలాలున్నాయి. అలాగే, జాన్స‌న్ టీమ్‌లో వైద్య శాఖ బాధ్య‌త‌లు చూసిన సాజిద్ జావిద్ పాక్ సంత‌తి నేత‌. వీరిలో రిషి సున‌క్‌కు బ్రిట‌న్‌ త‌దుప‌రి పీఎం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. కీల‌క‌మైన హోం శాఖ బాధ్య‌త‌లు చూసిన ప్రీతి ప‌టేల్‌కు క‌న్స‌ర్వేటివ్ పార్టీలో మంచి పేరుంది. ప్రీతి ప‌టేల్‌ బోరిస్ జాన్స‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా ఉన్నారు. అందువ‌ల్ల‌, బోరిస్ జాన్స‌న్ మ‌ద్దతు ప్ర‌స్తుతం ప్రీతికే ఉంద‌ని భావిస్తున్నారు. ఈ న‌లుగురిలో ఎవ‌రు పీఎం ప‌ద‌వి చేప‌ట్టినా.. రెండొంద‌ల ఏళ్ల‌కు పైగా భార‌తీయ ఉప‌ఖండాన్ని పాలించిన దేశంలో అత్యున్న‌త ప‌ద‌విని అధిష్టించిన భార‌త ఉప‌ఖండ నేత‌గా రికార్డు సృష్టిస్తారు.

More