మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో తిరుగుతున్న మగ చిరుత పులిని అటవీశాఖ అధికారులు పట్టేశారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా ఉంది. దీంతో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగి ఆ పులిని అత్యంత చాకచక్యంగా బంధించారు అటవీశాఖ సిబ్బంది. ఇది మగ చిరుత పులి అని, దీని వయసు ఐదేళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.