అయోధ్య రామాలయం వెలిగిపోతోంది. ప్రాణ ప్రతిష్ఠకు ముందు గుడిని రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అత్యంత అద్భుతంగా అలంకరించారు. లక్ష టన్నుల పూలు ఆలయ అలంకరణ కోసం ఉపయోగించారు.శోభాయమానంగా రాముడి ఆలయం కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం జరిగే వేడుకకు ఇప్పటికే ప్రధాని మోదీ సహా ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.