ఉగ్ర వాదుల శిబిరాలే లక్ష్యంగా మన దేశం మిసైల్ దాడులు చేసింది. 26 మంది టూరిస్టులను పొట్టన బెట్టుకున్న టెర్రరిస్టులను చావు దెబ్బ తీసింది. ఈ క్రమంలోనే పాక్ భారత్ పై డ్రోన్లతో దాడికి చేసింది. మనం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేయగా.. దాయాది దేశం సైతం ప్రతి దాడులు చేసింది. ఇలాంటి సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చింది. ఈ విషయం గుర్తించిన పుణే వ్యాపారులు ఆ దేశం నుంచి వచ్చే పండ్లను కొనుగోలు చేయమని చెప్పారు. టర్కీ యాపిల్స్‌ను బహిష్కరించారు. దీంతో పూణెలోని మార్కెట్లలో టర్కీ యాపిల్స్ కనిపించటం లేదు. దీని వల్ల ఆ దేశానికి రూ.1500 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.