Wrestlers Protest at Delhi: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్ కొత్త భవనం సమీపంలో తలపెట్టిన ‘మహాపంచాయత్' కు వెళ్లేందుకు రెజర్లు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు. ఈ ఘటనను రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. రెజ్లర్ల అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.