ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని వెళ్లారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. వారి సేవలను కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ఆదంపూర్ లోని ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ మరీ చూపిస్తూ పాకిస్తాన్ కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఉగ్ర దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. మన ఆడ బిడ్డల సింధూరం తుడిచిన వాళ్ల ఇళ్లలోకి వెళ్లి నాశనం చేసి వచ్చామని మోదీ అన్నారు.