పారా ఒలంపిక్స్ 2024 పోటీలో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటించారు. అందుకు సంబంధించిన హైలెట్స్ వీడియోను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీ వారితో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. వారు పోటీ పడిన విధానము, అక్కడ ఎదుర్కొన్న సమస్యలు, తీసుకున్న శిక్షణపై మోడీ అడిగారు. పారి స్ క్రీడల్లో భారత్ ఏకంగా 29 పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.