PM Modi speaks to Liz Truss; బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం లిజ్ ట్రస్ తో మోదీ ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అలాగే, భారత్, బ్రిటన్ సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో...