పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకున్నారు. వెంటనే మన దేశానికి తిరుగు పయనం అయ్యారు. నిజానికి మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాలి. అయితే మంగళవారం జరిగిన భారీ ఉగ్రదాడితో యావత్ దేశం ఉలికిపడింది. ఈ క్రమంలోనే తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారత్ బయల్దేరారు మోదీ.