BSF జవాన్‌ను విడుదల చేసిన పాక్.. 20 రోజుల తర్వాత అప్పగింత..-pakistan releases detained bsf jawan purnam kumar shaw india receives soldier on may 14 at attari ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bsf జవాన్‌ను విడుదల చేసిన పాక్.. 20 రోజుల తర్వాత అప్పగింత..

BSF జవాన్‌ను విడుదల చేసిన పాక్.. 20 రోజుల తర్వాత అప్పగింత..

Published May 14, 2025 04:08 PM IST Muvva Krishnama Naidu
Published May 14, 2025 04:08 PM IST

పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్‌ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్ సాహూను విడుదల చేశారు. పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు సాహూను అప్పగించారు. ఈ బీఎస్‌ఎఫ్‌ జవాన్ 182వ బెటాలియన్‌లో పని చేస్తున్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో విధుల్లో ఉన్నాడు. ఏప్రిల్‌ 23న సరిహద్దు దగ్గర కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దాని కింద రెస్ట్ తీసుకున్నారు. అయితే ఆ చెట్టు పాక్‌ భూభాగంలో ఉన్న విషయాన్ని తెలియలేదు. దీంతో పాక్ సైనికులు కస్టడీలోకి తీసుకున్నారు.

More