మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీలతోపాటు, వివిధ సంఘాల ప్రతినిధులు సైతం ఘటనను ఖండిస్తున్నారు. ఇటు ప్రధాని మోదీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే ఇది అవమానకరమన్న మోదీ.. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను వదిలిపెట్టమని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలో నిరసనలు మిన్నంటాయి. మణిపూర్ లో భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటాగా కేసు తీసుకుంది.