Onions Price: కన్నీళ్లు తెపిస్తున్న ఉల్లి.. మళ్లీ పెరుగుతున్న ధరలు-onion price hikes in all over india ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Onions Price: కన్నీళ్లు తెపిస్తున్న ఉల్లి.. మళ్లీ పెరుగుతున్న ధరలు

Onions Price: కన్నీళ్లు తెపిస్తున్న ఉల్లి.. మళ్లీ పెరుగుతున్న ధరలు

Published Oct 27, 2023 01:00 PM IST Muvva Krishnama Naidu
Published Oct 27, 2023 01:00 PM IST

  • ఉల్లిగడ్డల ధర పెరుగుదల మరోసారి సామాన్యుడిని భయపడేలా చేస్తోంది. కొంత కాలంగా నిలకడగా ఉన్న ఉల్లిగడ్డ ధర మరోసారి పెరుగదల ప్రారంభించింది. మార్చిలో రూ. 15 ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం 50-60కి పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో నిన్నమొన్నటి వరకు కిలో ఉల్లి 30-35 మధ్య ఉండగా ప్రస్తుతం 50 దాటేసింది. రైతు బజార్లలో ఈ ధర 45గా ఉంది. ఈ సారి వర్షాలు బాగా ఆలస్యం కావడంతో ఉల్లిసాగు ఆలస్యమైంది. ఇది సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. మహారాష్ట్ర సహా ఉత్తరాదిలోనూ ఉల్లి పంట సాగు తగ్గింది. నవంబర్‌ మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని, ఆ సరకు వస్తే ధర దిగివచ్చే అవకాశం ఉందంటున్నారు.

More