Soldiers sing 'sandese aate hain: సైనికులతో గొంతు కలిపి పాట పాడిన రక్షణ మంత్రి
Soldiers sing 'sandese aate hain: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం అస్సాంలోని దిన్జన్ మిలటరీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను, యుద్ధ సన్నద్ధతను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రికి సైనికులు తమలోని మరో టాలెంట్ ను ప్రదర్శించారు. యుద్ధం చేయడం లోనేే కాదు, పాటలు పాడడంలోనూ ముందుంటామని నిరూపించారు. బాలీవుడ్ హిట్ సినిమా ‘బోర్డర్’ లోని ‘సందేశే ఆతే హై’ పాటను, ఏఆర్ రెహ్మాన్ హిట్ సాంగ్ మా తుఝే సలాం పాటను రక్షణ మంత్రి ముందు పాడి వినిపించారు. వాటి పాటకు ఫిదా అయిన రాజ్ నాథ్ కాసేపు వారితో గొంతు కలిపి, వారిలో ఉత్సాహం నింపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మన సైనికుల గాన కౌశలాన్ని మీరు కూడా వినండి..