అక్టోబర్ 1 నుండి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి !
వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అక్టోబర్ 1, 2022 నుండి వాహనాదారులు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి కలిగి ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నితిన్ గడ్కరీ వివరించారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని గడ్కరీ తెలిపారు.