Telugu News  /  Video Gallery  /  Nato To Bleed Putin's Forces With Harpoon Missile System

రష్యాకు మ‌రో దుర్వార్త‌; ఉక్రెయిన్‌కు డెన్మార్క్‌ హార్పూన్ మిస్సైల్స్‌

24 May 2022, 21:03 IST HT Telugu Desk
24 May 2022, 21:03 IST

ఉక్రెయిన్‌తో యుద్ధం ర‌ష్యాకు ఆశించిన విధంగా సాగ‌డం లేదు. నెల రోజుల్లోపే పూర్త‌వుతుంద‌నుకున్న మిల‌ట‌రీ ఆప‌రేష‌న్ మూడు నెల‌లు దాటినా కొన‌సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ నుంచి ఊహించ‌ని ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. మ‌రోవైపు, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ప‌రోక్ష స‌హ‌కారం అందిస్తున్నాయి. తాజాగా, డెన్మార్క్ మ‌రో అత్యంత ఆధునిక, విధ్వంస‌క ఆయుధాన్ని ఉక్రెయిన్‌కు పంపిస్తోంది. ఈ యుద్ధ నౌకా విధ్వంస‌క క్షిప‌ణి ర‌ష్యా నౌకాద‌ళానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయ‌మని భావిస్తున్నారు. ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ యాక్టివ్ రాడార్ గైడెన్స్‌తో, అత్యంత త‌క్కువ ఎత్తులో ప్ర‌యాణిస్తూ శ‌త్రు నౌక‌ల ప‌ని ప‌డ్తుంది. దాదాపు 30 దేశాల‌కు ఈ హార్పూన్ మిస్సైల్స్‌ సేవ‌లందిస్తున్నాయి.

More