పండ్లలో రారాజు మియాజాకి రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి. జపాన్‌కు చెందిన ఈ పండుకు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో 2.50 లక్షల నుంచి 2.70 లక్షల ధర పలుకుతోంది. మన దేశంలో కొద్దిమంది రైతులు మాత్రమే మియాజాకి మామిడిని పండిస్తున్నారు. తీపి లేని ఈ పండులో చాలా పోషకాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన ఈ మామిడి.. పండిన తర్వాత కోత కోసం ఎదురు చూడడమే అతిపెద్ద సవాలు. మధ్యప్రదేశ్ లోని రైతు నలుగురు కూలీలు, ఒక వేట కుక్క, సీసీటీవీని వీటిని సంరక్షించేందుకు అమర్చాడు.