ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 దుకాణాల దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరైనా చనిపోయారా? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయాలు తెలియరాలేదు.