మయన్మార్, థాయ్ లాండ్ లో భారీ భూకంపం వచ్చింది. ఈ ధాటికి భవనాలు, వంతెనలు పేక మేడల్లా కూలాయి. జనాలు ఇళ్ల నుంచి బైటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్ మీద మయన్మార్ లో 7.7 తీవ్రతతో, థాయిలాండ్లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావం వల్ల థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని విధించారు.