Maharashtra politics : ‘మహా’ సంక్షోభం.. శివసేనను చీల్చేసిన ఏక్నాథ్!
- మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠతకు దారితీస్తున్నాయి. తనకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వారిలో 40మంది.. శివసేనకు చెందిన వారేనని స్పష్టం చేశారు. మరోవైపు.. మహారాష్ట్రలో బలపరీక్ష జరుగుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. బలపరీక్షలో ఎవరి సామర్థ్యాలు ఏంటో అనేది తేలిపోతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. సంక్షోభం వేళ.. శరద్ పవార్‌ను కేంద్రమంత్రులు బెదిరిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర తాజా అప్డేట్స్ మీకోసం..