Maharashtra Train Accident: భయంతో పక్క ట్రాక్‌పైకి దూకి..ప్రమాదంలో 12 మంది దుర్మరణం-maharashtra jalgaon train accident updates ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maharashtra Train Accident: భయంతో పక్క ట్రాక్‌పైకి దూకి..ప్రమాదంలో 12 మంది దుర్మరణం

Maharashtra Train Accident: భయంతో పక్క ట్రాక్‌పైకి దూకి..ప్రమాదంలో 12 మంది దుర్మరణం

Jan 23, 2025 11:15 AM IST Muvva Krishnama Naidu
Jan 23, 2025 11:15 AM IST

  • మహారాష్ట్రలోని జల్‌గావ్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక రైలులో నిప్పు రవ్వలు చెలరేగాయనే సమాచారంతో ప్రయాణికులు పట్టాలపైకి దూకేశారు. అదే సమయంలో మరో రైలు వీరిని ఢీ కొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీల్లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పు రవ్వలు పుట్టి కోచ్‌లలో పొగ వ్యాపించింది. దీంతో మహేజీ – పర్ధాడే స్టేషన్ల మధ్య పచోరా సమీపంలో ప్రయాణికులు చెయిన్‌ లాగి రైలును ఆపారు. మంటలు వ్యాపిస్తాయని రైలు నుంచి పక్క ట్రాక్‌పైకి దూకారు. ఇంతలో అదే ట్రాక్‌ పైన బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకొచ్చింది. ట్రాక్‌పైన ఉన్న ప్రయాణికులను ఈ రైలు ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 12 మంది మృత్యువాత పడ్డారు.

More