పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పాక్‌కు టర్కీ మద్దతు ఇవ్వడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ ఆన్‌లైన్ బుకింగ్‌లను పూర్తిగా నిలిపివేశాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ-జేఎన్‌యూ టర్కీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఒప్పందం గురించి యూనివర్సిటీ వీసీ శాంతి శ్రీ ధూళిపూడి పండిట్ మరిన్ని విషయాలు వెల్లడించారు.