రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 19వ తేదీ వినాయక చవితి రోజు జియో ఎయిర్‌ఫైబర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆప్టికల్ ఫైబర్ సాయంతో ప్రస్తుతం నిత్యం దాదాపు 15వేల ప్రాంగణాలను కనెక్ట్ చేయగల సామర్థం ఉందన్నారు. అయితే జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా రోజుకు లక్ష 50వేల కనెక్షన్లతో ఈ విస్తరణను సూపర్‌ఛార్జింగ్ చేయొచ్చునని అంబానీ స్పష్టం చేశారు. ఎయిర్‌ఫైబర్‌తోపాటు వివిధ అంశాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం అంబానీ వెల్లడించారు.