Telugu News  /  Video Gallery  /  Jaish Plot To Kill Nupur? Up Ats Nab Terror Suspect From Saharanpur

UP: నుపుర్‌ శర్మ హత్యకు కుట్ర - ఉగ్రవాది అరెస్ట్!

13 August 2022, 10:33 IST Mahendra Maheshwaram
13 August 2022, 10:33 IST

plan to kill nupur sharma: ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఓ ఉగ్రవాదిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సహ్రాన్‌పూర్‌లోని కుండా కాలా గ్రామానికి చెందిన మహమ్మద్‌ నదీమ్‌గా గుర్తించారు. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్‌’కు చెందిన ముష్కరులు అతడికి ఈ పని అప్పజెప్పారని తెలిపారు. సహ్రాన్‌పూర్‌లో నదీమ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి రెండు సిమ్ కార్డులు, బాంబు తయారీకి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పూర్తి వీడియో కోసం వీడియో చూడండి..…

More