ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలని తట్టు కోలేని దాయాది దేశం పాక్, మన సరిహద్దుల్లోని ప్రజలతో కాల్పులకు తెగబడింది. దీంతో అనేక మంది ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యారు. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇన్ని రోజులు వారంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకొని ఇప్పుడిప్పుడే తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో నిత్యవసర సరుకులు అందిస్తున్నారు భారత ఆర్మీ. ఈ క్రమంలోనే పలువురి ఇళ్లకి వెళ్లి ధైర్యం కూడా చెప్పారు సైనికులు.