హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండ ప్రాంతమైన ఈ రాష్ట్రంలో నివాసాలు కూలిపోతున్నాయి. పేక మేడల్లా నీటిలో కలిసిపోతున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ భయానక పరిస్థితులను చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదల ఉద్ధృతికి రైల్వే ట్రాకులు, రహదారులు కొట్టుకుపోతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు సమీక్షిస్తున్నారు.